రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ ఘటనపై..
ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు
ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం
మహారాష్ట్రకు చెందిన వారిగా అనుమానం
ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్ ఆర్‌ఐసీయూ విభాగంలో జరిగిన వెంటిలేటర్ల చోరీ సంచలనం రేపింది. రోగులకు అత్యవసర సేవల్లో వినియోగించే నాలుగు పరికరాలు ఏకంగా ఆస్పత్రి నుంచి చోరీ కావడం వెనుక ఇంటి దొంగల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టపగలే ఆసుపత్రిలోని రెండో అంతస్తులో రోగులు ఉన్న సమయంలో వెంటిలేటర్లు తీసే సాహసం చేశారంటే.. ఎవరో సిబ్బంది వారికి సహకరించారనే ప్రచారం సాగుతోంది. సీసీ ఫు టేజ్‌లో రికార్డులను పరిశీలించిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు చర్యలు ముమ్మ రం చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. గురువారం మధ్యాహ్నం వరకు నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఈ చోరీ ఘటనకు పాల్పడిన దుండగులు మహా రాష్ట్రకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. నిందితుల్లో ఒకరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దొంగలు పట్టుబడితే ఇంటిదొంగల బండారం బట్టబయలు కానుంది.
సిబ్బంది ఏం చేసినట్టు..
ఆస్పత్రిలోని ఏ విభాగంలోనైనా అక్కడ కేటా యించిన సిబ్బంది 24 గంటల పాటు తప్పనిసరిగా అందుబాటులో ఉంటారు. రోగులను పరి శీలిస్తూ ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. ఈ ఘటన మధ్యాహ్నం 2.37 గంటల సమయంలో చోటుచేసుకుంది. అదే వార్డులో ఎలక్ట్రీషియన్ పనులు సైతం జరుగుతున్నాయి. ఆ రెండు వార్డుల్లో మొత్తం 6 వెంటిలెటర్లు ఉండగా, ఒకేసారి నాలుగింటిని దొంగిలించి సంచిలో పెట్టుకొని తీసుకెళ్లినట్లు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. మధ్యాహ్నం షిప్టు వారు విధుల్లో ఉండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరికి ఎవరు సహకరించారనేది పోలీసుల విచారణ అనంతరం తేలనుంది. వెంటిలేటర్లను సంచిలో తీసుకెళ్తుండగా సిబ్బంది ప్రశ్నించకపోవడం వెనుక కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిందితులు మహారాష్ట్ర వాసులుగా
అనుమానం
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులు మహారాష్ట్ర వా సులుగా అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. సీసీ ఫుటేజీల ఆధారంగా వారి కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.ఇటీవల రిమ్స్‌లో ద్విచక్ర వా హనాలు, పలు వార్డుల్లో చోరీలు జరుగుతుండడంతో ప్రధానగేటు వద్ద పోలీసులు నిత్యం వా హనాలను తనిఖీ చేస్తున్నారు. అయినప్పటికీ ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం వెనుక సి బ్బంది పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. అలాగే సెక్యూరిటీ గార్డుల నిర్లక్ష్యం కూడా కారణంగా తెలుస్తోంది. ఎమర్జెన్సీ వార్డు వద్ద ఇద్దరు, రెండో గేటు వద్ద మరో ఇద్దరు విధులు నిర్వహిస్తుంటారు. ఎమర్జెన్సీ వార్డులోనికి వెళ్లిన తర్వాత లోపలి గేటు వద్ద కూడా మరో గార్డుతో పాటు ఆయావిభాగాల వద్ద సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఈ చోరీ జరగడం చోద్యంగా కనిపిస్తోంది.


