● కలెక్టర్ రాజర్షిషా
కై లాస్‌నగర్: జిల్లాలో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడంతో పాటు విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. జెడ్పీ సమావేశ మందిరంలో పాఠశాలల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, కేజీబీవీ స్పెషల్ ఆఫీస ర్లు, మోడల్ స్కూల్, ఆశ్రమ పాఠశాలల ప్రిన్సిపాళ్లతో యూడైస్ ప్లస్, పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అంశాలపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చదువులో వెనుకబడిన ప్రాథమిక పాఠశాల విద్యార్థుల అభ్యసన సా మర్థ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేకంగా రూ పొందించిన ‘సంకల్ప్’ కార్యక్రమాన్ని గురువారం నుంచి జిల్లావ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు తెలి పారు. పదిరోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఐటీడీఏ డీడీ భాస్కర్, డీఈ వో మాధవి, సెక్టోరియల్‌అధికారులు లక్ష్మణ్, రఘు రమణ, తిరుపతి, సరిత, ఉస్మాన్ పాల్గొన్నారు.
రీసర్వే వేగవంతం చేయాలి
నార్నూర్: భూముల రీసర్వే వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఉ ట్నూర్ సబ్‌కలెక్టర్ ప్రణయ్‌కుమార్‌తో కలిసి మండలంలోని గంగాపూర్(జి) గ్రామంలో బుధవారం ప ర్యటించారు. సర్వే పనులను పరిశీలించారు. ప్రభు త్వ భూములకు తొలి ప్రాధాన్యం ఇస్తూ సర్వే పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజలింగు, ఎంపీడీవో పుల్లయ్య, సర్పంచ్ ఉషరమేశ్‌రాథోడ్, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.


