గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

Nov 4 2026 11:40 PM | Updated on Nov 4 2026 11:40 PM

ఉట్నూర్‌రూరల్‌: కుంరం సూరు 29వ వర్ధంతి ఐటీడీఏ ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని కొలంగూడ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యులు హుస్సేన్‌ నాయక్‌, ఎంపీ గోడం నగేశ్‌, కలెక్టర్‌ రాజర్షిషా, ఐటీడీఏ పీవో మంద మకరందు, సబ్‌ కలెక్టర్‌ ప్రణయ్‌ కుమార్‌, ఉట్నూర్‌ ఏఎస్పీ రుత్విక్‌ హాజరయ్యారు. వారు కుంరం సూరు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యులు హుస్సేన్‌ నాయక్‌ మాట్లాడుతూ.. గిరిజనులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలని పిలుపునిచ్చారు. కలెక్టర్‌ రాజర్షిషా మాట్లాడుతూ.. జిల్లాలో కొలమ్‌ జాతికి చెందిన సుమారు 7,000 కుటుంబాలు ఉన్నాయని, 9 శాఖల ద్వారా పీఎం జన్మన్‌ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎంపీ గోడం నగేశ్‌, ఐటీడీఏ అధికారులు, సంఘ నాయకులు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement