చికిత్స పొందుతూ యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ యువకుడి మృతి

Nov 4 2026 11:40 PM | Updated on Nov 4 2026 11:40 PM

గుడిహత్నూర్‌: మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన యువకుడు రిమ్స్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మండలంలోని లింగాపూర్‌ గ్రామానికి చెందిన నర్వటే కిరణ్‌ (31)కు వివాహం జరిగి విడాకులయ్యాయి. తండ్రి నాగోరావ్‌తో కలిసి మండల కేంద్రంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో పాలేరుగా పని చేస్తున్నాడు. భార్య లేక పోవడం, మరో వివాహం జరగకపోవడంతో పాటు ఆర్థిక పరిస్థితులు బాగా లేక తీవ్ర మనస్తాపం చెందిన కిరణ్‌ మద్యం మత్తులో ఆదివారం సాయంత్రం చేనులో పురుగుల మందు తాగి తండ్రికి తెలిపాడు. తండ్రి నాగోరావ్‌ స్థానికుల సహాయంతో వెంటనే రిమ్స్‌కు తరలించాడు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement