గుడిహత్నూర్: రోడ్డు ప్రమాదంలో ఇచ్చోడ మండలం జామిడి గ్రామానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ జాదవ్ సాయి ప్రసాద్(28) బుధవారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. సెలవుల్లో ఇంటికి వచ్చిన ఆయన స్నేహితుడు ఓంకార్‌తో కలిసి పల్సర్ బైక్‌పై షాపింగ్‌కు ఆదిలాబాద్‌కు వెళ్తుండగా వెనుక నుంచి ఐచర్ వాహనం ఢీ కొనడంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మిత్రుడు ఓంకార్ తీవ్రగాయాలతో రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. సాయి ప్రసాద్‌కు భార్య సౌజన్య, బాబు ఉన్నా డు. కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎ స్సై శ్రీకాంత్ తెలిపారు.


