చైన్‌స్నాచింగ్‌ అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

చైన్‌స్నాచింగ్‌ అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్‌

Nov 4 2026 11:40 PM | Updated on Nov 4 2026 11:40 PM

● 10 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం ● కారు, ఆటో, ఐదు సెల్‌ఫోన్లు పట్టివేత ● ఆదిలాబాద్‌ ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: వృద్ధులు, ఒంటరి మహిళలను ల క్ష్యంగా చేసుకుని బంగారు గొలుసుల చోరీలకు పా ల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ సమావేశ మందిరంలో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని వార్ధాకు చెందిన ఎనిమిది మంది నిందితులు విశాల్‌ సావంత్‌ పాత్రే, అల్లా రహీమ్‌, సంజయ్‌, లొండే విశ్వదీప్‌, షైక్‌ ఫెరోజ్‌లతో పాటు మహిళా నిందితులు రంజిత పాత్రే, లక్ష్మీ అజిత్‌ బోకర్‌, నాడే నిషాలు ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ పలు నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. వారు కారు, ఆటోలో ఒంటరిగా వెళ్లే వృద్ధ మహిళలను గుర్తించి ఎక్కించుకునేవారు. వారి దృష్టి మళ్లించి మెడలోని బంగారు గొలుసు చోరీ చేసేవారు.

ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో ఆరు కేసులు..

ఆదిలాబాద్‌ పట్టణంలో వారం రోజుల క్రితం ఓ మహిళను ఆటోలో ఎక్కించుకుని ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించినట్లు ఎస్పీ తెలి పారు. గతేడాది శ్రీరామనవమి వేడుకల సందర్భంగా పట్టణంలో భోజనాల సమయంలోనూ, జాతీ య రహదారి పక్కన ఉన్న రామాలయంలో జరిగి న అన్నదానంలోనూ ఇదే తరహా నేరాలకు పా ల్పడ్డారు. గతనెల 31న నిర్మల్‌ పట్టణంలో ఇద్దరు మ హిళల బంగారు గొలుసులను అపహరించారు. అ నంతరం ఆదిలాబాద్‌ వస్తుండగా పోలీసులను చూ సి పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల నుంచి 20 గ్రాముల బంగారు గొలుసుతో పాటు సుమారు 10 గ్రాముల చొ ప్పున రెండు బంగారు ముక్కలు, ఏడు గ్రాములు, మూడు గ్రాముల బంగారు ముక్కలు, నిర్మల్‌లో చో రీకి గురైన 25 గ్రాములు, 26 గ్రాముల రెండు గొలు సులను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు డస్టన్‌ కారు, బజాజ్‌ ఆటో, అదనపు నంబర్‌ ప్లేట్‌, ఐదు సెల్‌ఫోన్లను పట్టుకున్నారు. దొంగిలించిన బంగారాన్ని కరిగించి చిన్న ముక్కలుగా మార్చి వి క్రయిస్తున్నట్లు గుర్తించారు. కేసు ఛేదనలో కృషి చేసి న పోలీసు అధికారులు, సి బ్బందిని అభినందించి ఎస్పీ నగదు రివార్డులు ప్రకటించారు. సమావేశంలో ఆదిలాబాద్‌ డీఎస్పీ జీవన్‌ రెడ్డి, వన్‌టౌన్‌ సీఐ సునీల్‌ కుమార్‌, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌, ఎస్సై ఎన్‌.నాగనాథ్‌, ఆర్‌ఎస్సై గోపికృష్ణ, పో లీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement