ఆదిలాబాద్‌రూరల్: ఆర్టీసీలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.లక్ష వసూలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి బుధవారం అరెస్ట్ చేసినట్లు మావల పీఎస్ ఎస్‌హెచ్‌ఓ బీడీ ప్రేమ్ కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం ఇంద్రవెల్లి మండలానికి చెందిన గావాండే గజానంద్ ఆర్టీసీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. పట్టణంలోని కై లాస్‌నగర్‌కు చెందిన కె.పవన్ కల్యాణ్‌కు ఆర్టీసీలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.లక్ష తీసుకున్నాడు. ఉద్యో గం ఇప్పించకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితుడు పలుమార్లు కోరినా డబ్బులు ఇవ్వలేదు. దీంతో ఆయన ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
పంట మధ్యలో
గంజాయి సాగు
బోథ్: సొనాల మండలంలోని కోట కె గ్రామ శివారులో పత్తి, కంది పంటల మధ్య రహస్యంగా సాగు చేస్తున్న 11 గంజాయి మొక్కలను బోథ్ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.1.10 లక్షలుగా అంచనా వేసినట్లు ఎస్సై వి.పురుషోత్తం తెలిపారు. గతంలో గంజాయి సేవించే అలవాటున్న కోట కె గ్రామానికి చెందిన శివరాం పెస్వే విత్తనాలు సేకరించి తన చేనులో సాగు చేస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని మహా లక్ష్మివాడకు చెందిన సర్వరి గౌతమ్ (58) ఆర్టీసీ బస్సు ఢీకొని మృతిచెందిన ఘటన బుధవారం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఉదయం ఠాకూర్ హోటల్ వైపు నుంచి రోడ్డు దాటుతుండగా, బస్టాండ్ నుంచి మహారాష్ట్రలోని పాండర్‌కౌడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాల పాలైన ఆయన ఘటన స్థలంలోనే మృతిచెందాడు. మృతుడి కుటుంబీకుల ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు.
ఇంట్లో నుంచి
సెల్‌ఫోన్లు చోరీ
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని నేతాజీ చౌక్‌లో గల ఓ ఇంట్లో గత నెల 13న సెల్‌ఫోన్లు చోరీకి గురయ్యాయి. మోచిగల్లికి చెందిన బియ్యాల లక్ష్మణ్, ఆయన కుటుంబ సభ్యులు రాత్రి సమయంలో నిద్రిస్తుండగా నిందితులు ఫోన్లను అపహరించినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా, బుధవారం నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.


