బాసర: బాసర ట్రిపుల్ ఐటీ పరిపాలనా భవనంలో ‘క్వాంటమ్ కమ్యూనికేషన్స్, అప్లికేషన్స్’ అంశంపై మూడు రోజుల ఉపాధ్యాయ శిక్షణ బుధవారం ప్రారంభమైంది. ఐఐటీఎమ్ సిడాట్ సంజ్ఞా టెక్నాలజీస్ ఫౌండేషన్ సహకారం అందించగా, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం కార్యక్రమాన్ని నిర్వహించింది. వీసీ గోవర్ధన్, ఆన్లైన్లో సంజ్ఞా టెక్నాలజీస్ సీఈవో డాక్టర్ రవీంద్ర బార్లింగే, క్యూకై ్లర్వాయన్స్ క్వాంటమ్ రిటైర్డ్ ల్యాబ్స్ డైరెక్టర్ కల్నల్ సాయి శంకర్, సేల్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
పూర్వ విద్యార్థినితో ఇంటరాక్టివ్ సెషన్
బాసర ట్రిపుల్ ఐటీ అల్యూమ్ని, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సెల్ ఆధ్వర్యంలో కంప్యూటర్ సైన్స్ బీ 08 బ్యాచ్ పూర్వ విద్యార్థిని, లండన్లోని డెలాయిట్ సంస్థ ప్రతినిధి జక్కా శ్రావణితో విద్యార్థుల ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. శ్రావణి జీవన ప్రయాణంపై రాసిన ‘ఆమెకథ’ పుస్తకాన్ని వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ ఆవిష్కరించారు.


