మోటారు వైర్ల చోరీ నిందితుల పట్టివేత | - | Sakshi
Sakshi News home page

మోటారు వైర్ల చోరీ నిందితుల పట్టివేత

Nov 4 2026 11:40 PM | Updated on Nov 4 2026 11:40 PM

లక్ష్మణచాంద: సరస్వతి కాలువ వెంట మోటార్లకు సంబంధించిన విద్యుత్తు వైర్లను దొంగిలిస్తున్న ఇద్దరు వ్యక్తులను రైతులు చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. సోన్‌ మండలం కడ్తాల్‌ గ్రామానికి చెందిన రైతులు కొత్తగొల్ల భోజన్న, బర్మ లక్ష్మణ్‌ సరస్వతి కాలువలోని మిగులు నీటిని వినియోగించుకుంటూ విద్యుత్తు మోటార్ల ద్వారా పంటలు సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో సోన్‌ మండలంలోని న్యూ బొప్పారం గ్రా మానికి చెందిన కుంచపు లక్ష్మణ్‌, నిజామాబాద్‌ జి ల్లా వేల్పూర్‌ గ్రామానికి చెందిన గుపాల్వాడ్‌ శ్రీని వాస్‌లు గతంలో దొంగతనం కేసులో జైలుకు వెళ్లి ఇటీవలే బయటకు వచ్చారు. మంగళవారం ఉద యం సోన్‌ మండలం కడ్తాల్‌ సమీపంలో సరస్వతి కాలువపై రైతులకు చెందిన మోటార్ల వైర్లను దొంగిలించి పరారవుతుండగా రైతు గుర్రం లింగన్న, మరో ఇద్దరు రైతులు అప్రమత్తమై చాకచక్యంగా ప ట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించా రు. రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వారిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై గోపి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement