క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు | - | Sakshi
Sakshi News home page

క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు

Nov 4 2026 11:40 PM | Updated on Nov 4 2026 11:40 PM

ఉట్నూర్‌రూరల్‌: క్రీడాకారులు తమ జీవితంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని అలవర్చుకుంటారని ఐటీడీఏ డీడీ అశోక్‌ కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం ఉట్నూర్‌ కే.బి. కాంప్లెక్స్‌ మైదానంలో ఉమ్మడి జిల్లా ఎస్‌జీఎఫ్‌ బాయ్స్‌ 14, 17 ఏళ్లలోపు విద్యార్థుల ఖోఖో పోటీలు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ క్రీడలను క్రీడాస్ఫూర్తితో ఆదరించాలని, క్రీడల ఆధారంగానే ప్రయాణం సాగుతుందని, విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగితేనే జీవితంలో రాణించగలరన్నారు. అనంతరం జరిగిన పోటీల్లో ఆదిలా బాద్‌ బాయ్స్‌ జట్లు 17 ఏళ్ల విభాగం పోటీల్లో విజేతలుగా నిలిచారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె.పార్థసారథి, జిల్లా క్రీడా అసోసియేషన్‌ కార్యదర్శి పి.కృష్ణ, కోచ్‌లు, పీడీలు జై. హేమంత్‌, గంగారం, భూమేష్‌, సజన్‌, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement