ఆదిలాబాద్‌రూరల్: పత్తి, కంది పంటల మధ్య అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రంపై ఎకై ్సజ్, జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు మంగళవారం సంయుక్తంగా దాడులు నిర్వహించినట్లు ఎకై ్సజ్ సీఐ ఆకుల శ్రీనివాస్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు మావల మండలం వాఘపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కొలాంగూడ శివారులో కొడప జ్యోతిరామ్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో తనిఖీలు నిర్వహించగా పత్తి, కంది పంటల మధ్య సాగు చేస్తున్న 62 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ట్రెయినీ సీఐ దేవేందర్, జిల్లా టాస్క్‌ఫోర్స్ ఎస్సై శ్రావణ్ కుమార్, ఎకై ్సజ్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.


