తలమడుగు: మూర్చవ్యాధితో బాధపడుతున్న వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని ఉండం గ్రామానికి చెందిన రేంజర్ల గంగన్న (78) ఎనిమిదేళ్లుగా మూర్చవ్యాధితో బాధపడుతున్నాడు. హైదరాబాద్, ఆదిలాబాద్, చుట్టుపక్కల ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా వ్యాధి నయంకాలేదు. దీంతో మనస్థాపం చెంది సోమవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా రేకులషెడ్‌లో ఉరేసుకున్నాడు. మృతునికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్చార్జి ఎస్సై జీవన్‌రెడ్డి తెలిపారు.


