లక్ష్మణచాంద: జీవితంపై విరక్తితో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోన్ మండలంలోని కడ్తాల్‌లో చోటు చేసుకుంది. ఎస్సై గోపి తెలిపిన వివరాల మేరకు సోన్ మండలంలోని కడ్తాల్‌కు చెందిన చింతల నడిపి గంగన్న (54) కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. నిర్మల్ ఆస్పత్రిలో చూపించుకున్నా నయం కాకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. మంగళవారం ఉదయం కడా్‌త్ శివారులోని మామిడి తోటలో ఉరేసుకున్నాడు. అటుగా వెళ్లిన వారు గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. మృతుని కుమారుడు చింతల ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై గోపి తెలిపారు.


