రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు

Nov 4 2026 1:20 AM | Updated on Nov 4 2026 1:20 AM

ఇంద్రవెల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌ మండలంలోని చిన్నదంపూర్‌ గ్రామానికి చెందిన మండాడి కిషన్‌, సిడాం కృష్ణ మంగళవారం ఇంద్రవెల్లి మండలంలోని డొంగర్‌గాంకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వొల్మద్రి గ్రామ సమీపంలో బైక్‌ అదుపుతప్పి కిందపడ్డారు. ఘటనలో సిడాం కృష్ణకు తీవ్రగాయాలు కావడంతో 108లో ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. కృష్ణ పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్తులు తెలిపారు.

రాచాపూర్‌లో మళ్లీ విద్యుత్‌ వైర్ల చోరీ

లక్ష్మణచాంద: మండలంలోని రాచాపూర్‌లో రైతుల విద్యుత్‌ మోటార్ల కేబుల్‌ చోరీ ఆగడం లేదు. ఇటీవలే పలువురు రైతుల మోటార్ల విద్యుత్‌ వైర్లు కోసుకుపోయిన విషయం తెలిసిందే. మళ్లీ సోమవారం రాత్రి గ్రామానికి చెందిన రాందేని మహేష్‌, బొర్నన్న, సాయన్న, వికాస్‌, చిన్నయ్య, నాగరాజు సరస్వతి కాలువపై ఏర్పాటు చేసుకున్న విద్యుత్‌ మోటార్ల కేబుల్స్‌ ఎత్తుకెళ్లారు. పంటలు చివరి దశకు చేరిన సమయంలో నీళ్లు ఎలా అందించాలని రైతులు ఆవేధన చెందుతున్నారు.

బాసర గోదావరిలో

మృతదేహం లభ్యం

బాసర: బాసర గోదావరి నదిలో మంగళవారం వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. నిజామాబాద్‌లోని నాందేవ్‌వాడకు చెందిన జాదవ్‌ జ్యోతిరామ్‌ (49) క్యాటరింగ్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. సోమవారం కూడా మద్యం సేవించి ఇంటికి వెళ్లగా భార్య గంగలత ప్రశ్నించడంతో ఇంటినుంచి బయటకు వెళ్లిపోయాడు. మంగళవారం బాసర గోదా వరి నదిలో మృతదేహం లభ్యమైంది. మ ద్యానికి బానిసై జీవితంపై విరక్తితో గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుని భార్య గంగలత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌హెచ్‌వో సీఐ దీపక్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement