కేయూక్యాంపస్ : దేశ ఫార్మసీ విద్య, పరిశోధన రంగంలో తనదైన ముద్రవేసిన ప్రముఖ విద్యావేత్త, ఔషధ శాస్త్రవేత్త, కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ ఆచార్య చంద్రకాంత్ కొకాటే(79) ఇక లేరు. అ నారోగ్య కారణాలతో సోమవారం రాత్రి మహారాష్ట్రలోని పూణెలో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొకాటే 2001–04 వరకు కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్(ఉపకులపతి)గా సేవలందించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భైంసాకు చెందిన కొకాటా కేయూ ఫార్మసీ కళాశాలలో ప్రొఫెసర్‌గా నియమితులై పిన్సిపాల్ అండ్ విభాగం అధిపతి, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్, కేయూ యూజీసీ కోఆర్డినేటింగ్ ఆఫీసర్, ఫార్మసీ డీన్‌గా కీలక పదవులు చేపట్టారు. వీసీగా కొనసాగుతూ కూడా ఫార్మాకాగ్నెసి, ఫొరెన్సిక్ ఫార్మసీ సబ్జెక్టుల విద్యార్థులకు విద్యాబోధన చేసిన ఘనత ఆయనకే దక్కింది.
ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా..
న్యూఢిల్లీలోని ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) అధ్యక్షుడిగా కూడా చంద్రకాంత్ బాధ్యతలు నిర్వర్తించారు. ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఇండియన్ సొసైటీ ఆఫ్ ఫార్మకోగ్నసి అధ్యక్షుడిగా పని చేశారు. యూజీసీ, న్యాక్, నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ తదితర సంస్థల కమిటీలు, సలహా మండళ్లలోనూ పనిచేశారు.
పరిశోధన గ్రంథ రచనల్లో విశేష కృషి..
ప్రొఫెసర్ కొకాటే జాతీయ, అంతర్జాతీయ పరిశోధన పరంగా 115కిపైగా వ్యాసాలు రాశారు. ఫార్మసీ విద్యార్థులకు ఉపయోగపడే ఏడు పుస్తకాలు ర చించారు. ఆయన పర్యవేక్షణలో 17 మంది పరిశోధకులు పీహెచ్‌డీ పూర్తి చేశారు. చంద్రకాంత్ కొంత సర్వీస్ ఉండగానే వలంటీర్ రిటైర్మెమెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత కర్నాటక రాష్ట్రం బెల్గాంలోని కెఎల్ యూనివర్సిటీ వీసీగా పదేళ్లపాటు సేవలు అందించారు.
పురస్కారాలు..
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 28కిపైగా పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచంలోని సుమా రు 35 దేశాలను విద్య, పరిశోధన, వృత్తిపరమైన కార్యక్రమాల నిమిత్తం సందర్శించారు.
వీసీ, రిజిస్ట్రార్ సంతాపం..
ఆచార్య చంద్రకాంత్‌కొకాటే మృతిపై కేయూ వీసీ కె.తాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం, కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు బి. వెంకట్రామ్‌రెడ్డి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ జె.కృష్ణవేణి, మాజీ డీన్ గాదె సమ్మయ్య సంతాపం తెలి పారు.


