బోథ్: హనుమకొండలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫ్యాషన్ పోటీల్లో బోథ్ మండలానికి చెందిన నాంపల్లి శాన్వి సబ్ జూనియర్ విభాగంలో అద్భుత ప్రతిభ కనబరిచి శ్రీమిస్ తెలంగాణశ్రీ విజేతగా నిలిచింది. తెలంగాణ ఫ్యాషన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఈ నెల 1న హనుమకొండలోని కేఎల్‌ఎం కన్వెన్షన్‌లో శ్రీతెలంగాణ స్పార్క్‌శ్రీ పేరిట రాష్ట్ర స్థాయి బ్యూటీ పేజెంట్ గ్రాండ్ ఫినాలే నిర్వహించారు. ఈ పోటీల్లో బోథ్ పట్టణానికి చెందిన నాంపల్లి సాయిసాగర్, అనిత దపంతుల కుమార్తె శాన్వి సబ్ జూనియర్ విభాగంలో పాల్గొని సంప్రదాయ వస్త్రధారణ, ఆత్మవిశ్వాసంతో కూడిన ర్యాంప్ వాక్‌తో న్యాయనిర్ణేతలను మెప్పించింది. శ్రీసబ్ జూనియర్ మిస్ తెలంగాణశ్రీ కిరీటాన్ని దక్కించుకోవడంతో పాటు శ్రీమిస్ ఆటిట్యూడ్‌శ్రీ అవార్డును కూడా కై వసం చేసుకుంది. రాష్ట్ర స్థాయి పోటీల్లో టైటిల్ గెలుచుకుని మండల కీర్తిని చాటిన చిన్నారి శాన్విని స్థానిక ప్రముఖులు, బంధుమిత్రులు, గ్రామస్థులు అభినందించారు.
సాఫ్ట్‌బాల్ పోటీలకు
ఎంపిక
బెల్లంపల్లి: పట్టణంలోని జూనియర్ కళాశాల విద్యార్థిని శివాన్విత ఇటీవల నిర్వహించిన జిల్లాస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ ఆవునూరి అంజయ్య తెలిపారు. గజ్వేల్‌లో ఈనెల 4, 5, 6 తేదీల్లో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా తరపున పాల్గొననున్నారు. మంగళవారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శివాన్వితను అభినందించారు.


