క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్‌

Nov 4 2026 1:20 AM | Updated on Nov 4 2026 1:20 AM

ఆదిలాబాద్‌: క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని డిప్యూటీ డీఈవో జి.చందన్‌ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆదిలాబాద్‌ డివిజన్‌ స్థాయి గిరిజన క్రీడా పోటీలను ఏపీవో పీవీటీజీ ఏ.భాస్కర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రతిరోజూ సాధన చేస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబర్చిన వారికి ఉద్యోగాల్లో 2 శాతం రిజర్వేషన్‌ సౌకర్యం కూడా ఉందన్నారు. డివిజన్‌ స్థాయిలో ఎంపికై న క్రీడాకారులు జోనల్‌ స్థాయిలోనూ సత్తా చాటేందుకు మరింత కష్టపడాలని సూచించారు. క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడంలో పీడీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. అనంతరం వాలీబాల్‌, అథ్లెటిక్స్‌, కబడ్డీ, ఖోఖో, టెన్నికాయిట్‌, క్యారమ్స్‌, చెస్‌ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తదుపరి స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో డీటీఎస్‌వో కె.పార్థసారథి, ఏటీడీవో రాథోడ్‌ అనిల్‌, పీజీ హెచ్‌ఎంలు జె.ప్రేమ్‌దాస్‌, ఎస్‌.భోజన్న, డీఎస్‌ఏ సూపరింటెండెంట్‌ రజీ ఉద్దీన్‌, పి.లక్ష్మణ్‌, శ్రీనివాస్‌, రవీందర్‌, ప్రేమ్‌సింగ్‌, గోపాల్‌, రాంచందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement