ఆదిలాబాద్‌లోని రైతుబజార్లో రైతులతో పాటు స్వయం సహాయక సంఘాలకు చెందిన మేము ఏళ్లుగా కూరగాయలు విక్రయిస్తున్నాం. ఇటీవల రైతుబజార్ వెలుపల కొంతమంది తోపుడు బండ్లు ఏర్పాటు చేశారు. దీంతో మా గిరాకీ తగ్గింది. రుణాల వాయిదాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.
– రైతుబజార్ కూరగాయల విక్రయదారులు
హామీ ఇచ్చారు.. మరిచారు
మేము పశుపోషణపై ఆధారపడి జీవిస్తున్న పాడి రైతులం. ఈ ఏడాదిలో మేలో మేతకోసం వెళ్లిన మా గేదెలు విద్యుత్ తీగలకు తగిలి ఐదు చనిపోయాయి. పరిశీలించిన అధికారులు పరిహారం చెల్లి స్తామని హామీ ఇచ్చారు. ఐదు నెలలైనా పట్టించుకోవడం లేదు. ఆదుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశాం. – బాధిత రైతులు, జైనథ్


