నాకు గ్రామ శివారులోని సర్వేనంబర్ 56/1లో 4.37 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ధరణి పాస్‌బుక్‌తో పాటు పహానీలు సైతం నా పేరిటే ఉన్నాయి. ఇందులో 2.33 ఎకరాలు కాలువ నిర్మాణంలో పోతుంది. సంబంధించిన డాక్యుమెంట్స్ అందించాలని తహసీల్దార్ కార్యాలయ అధికారులు చెప్పగా అన్ని వివరాలు అందజేశాను. రూ.29లక్షల పరిహారం వస్తుందని చెప్పారు. వారం క్రితం ఆర్డీవో కార్యాలయంలో సంప్రదించగా ఈ పరిహారం జీఎస్ కంపెనీకి పోతుందని అంటున్నారు. విచారణ జరిపించి నాకు న్యాయం చేయాలని కోరుతున్నా.
– చిట్యాల సురేందర్, తాంసి–కే
సర్టిఫికెట్ ఇవ్వడం లేదు..
నా చిన్నకుమారుడు అరుణ్‌కుమార్ ఇటీవల చనిపోయాడు. ఆయన పేరిట ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. భార్య, పిల్ల లేవరు లేకపోవడంతో ఆ భూమిని నా పేరిట విరాసత్ చేయాలని దరఖా స్తు చేశాను. ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం తహసీల్దా ర్ కార్యాలయంలో దరఖాస్తు చేయగా రెవెన్యూ అధికారులు ఇవ్వడం లేదు. నా పెద్ద కుమారుడు ఒత్తిడి తెస్తుండటంతోనే వారు నిరాకరిస్తున్నారు. విచారణ జరిపించి నాకు న్యాయం చేయాలి.
– బంజపెల్లి భూమయ్య, సొనాల


