ఆదిలాబాద్‌టౌన్: వియత్నాం దేశంలో నిర్వహించిన అంతర్జాతీయ విద్యా ఎక్స్పోజర్ విజిట్‌ను విజయవంతంగా పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన ఉపాధ్యాయులు సోమవారం డీఈవో మాధవిని మర్యాదపూర్వకంగా కలిశా రు. జెడ్పీఎస్ఎస్ పిప్పర్వాడ గెజిటెడ్ ప్రధానో పాధ్యాయురాలు గడ్డం శశికళ, ఎంపీపీఎస్ యాపల్‌గూడ హెచ్ఎం కట్ట సుజాత తమ పర్యటన అనుభవాలను వివరించారు. వియత్నాంలోని విద్యా వ్యవస్థ, బోధన పద్ధతులు, పాఠశాలల నిర్వహణ తీరును పరిశీలించామ ని, ఉత్తమ పద్ధతులను జిల్లాలోని పాఠశాలల్లో అమలు చేసేందుకు కృషి చేస్తామని ఉపాధ్యాయులు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంవో లక్ష్మణ్ తదితరులున్నారు.


