ఆదిలాబాద్‌టౌన్: మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతకు షీటీంలు నిరంతరం నిఘా పెంచాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్ సమావేశ మందిరంలో షీటీం, పోలీస్ అక్క సిబ్బందితో సోమవారం నెలవారీ సమీక్ష నిర్వహించారు. అక్టోబర్‌లో చేపట్టిన కార్యక్రమాలు, నమోదైన కేసుల వివరాలను సమీక్షించారు. షీటీంలకు మొత్తం 114 ఫిర్యాదులు అందగా, వాటిపై స్పందించి 102 ఈ–పెట్టి కేసులు, 6 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. వేధింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవడంతో పాటు 17 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. మహిళలు, విద్యార్థినులు ఎక్కువగా సంచరించే పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లు, షాపింగ్ ప్రాంతాలు తదితర 93 ప్రదేశాల్లో ప్రత్యేక పరిశీలనలు నిర్వహించారు. 39 గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఒక బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు, బాలికలు ఈవ్‌టీజింగ్, వేధింపులు, అసభ్య ప్రవర్తన, బ్యాడ్ టచ్ వంటి ఘటనలు ఎదురైనప్పుడు భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఎలాంటి వేధింపులు ఎదురైనా షీటీం నం.8712659953, డయల్ 112, సమీప పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ మౌనిక, షీటీం ఏఎస్సై సుశీల, హెడ్ కానిస్టేబుల్ వాణిశ్రీ, పోలీస్ అక్క సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మార్పు కోసమే చలాన్ల విధింపు
ప్రజల్లో మార్పు కోసమే వాహనాలకు చలాన్లు విధిస్తున్నామని ఎస్పీ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆదిలాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. వాహనాల స్థితిగతులతో పాటు రికార్డులు, సిబ్బంది హాజరు పట్టికలను పరిశీలించారు. అనంతరం ఆవరణలో మొక్క నాటారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, ట్రాఫిక్ సీఐ వెంకటేశ్వర్లు, రిజర్వ్ సబ్ఇన్స్పెక్టర్ దేవేందర్ ఉన్నారు.
ప్రతీ సమస్యకు పరిష్కారం చూపాలి
ఆదిలాబాద్‌టౌన్: బాధితుల ప్రతీ సమస్యను పరిష్కరించే దిశగా పోలీసులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నా రు. జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో జిల్లా వ్యాప్తంగా 34 మంది బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా మాట్లాడారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీసీ కొండరాజు, సిబ్బంది వాణిశ్రీ, వామన్, సునీల్, లిఖిత తదితరులు పాల్గొన్నారు.


