పరిశీలించిన ఇరిగేషన్, బల్దియా అధికారులు
కూల్చివేయాలని నిర్మాణదారుకు ఆదేశం
కై లాస్‌నగర్: పట్టణంలోని క్రాంతినగర్‌లో గల భీంసరి వాగుపై రియల్టర్ నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాన్ని ప్రస్తావిస్తూ ‘అక్రమ లేఅవుట్‌కు అనధికార వంతెన’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం కథనం ప్రచురితమైంది. ఈమేరకు కలెక్టర్ రాజర్షి షా స్పందించారు. ఇరిగేషన్ అధికారులపై సీరియస్ అ య్యారు. తక్షణమే విచారణ జరిపి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈమేరకు ఈఈ భుక్యా భీంరావు, డీఈ రాథోడ్ ప్రేసింగ్, ఏఈ కేడి సాగర్, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఆఫీసర్ సాయికృష్ణ సోమవారం వంతెనను పరిశీలించా రు. అక్కడ పనులు చేస్తున్న కూలీలతో మాట్లాడి నిర్మాణదారు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమతులు లేకుండా, నాసిరకంగా నిర్మిస్తున్న వంతెన ప్రమాదకరంగా ఉన్నట్లుగా గుర్తించా రు. వారం రోజుల్లోగా కూల్చివేయాలని నిర్మాణ దారును ఆదేశించారు. లేకుంటే మున్సిపల్ ఆ ధ్వర్యంలో కూల్చివేస్తామని స్పష్టం చేశా రు. కలెక్టర్‌కు పూర్తి నివేదిక అందజేయనున్నట్లు అధికా రులు వెల్లడించారు. ‘సాక్షి’ చొరవ, కలెక్ట ర్ స్పందనపై కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.


