సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి

Nov 3 2026 12:57 AM | Updated on Nov 3 2026 12:57 AM

● వీసీలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి

కై లాస్‌నగర్‌: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేసి పెండింగ్‌లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్ని కల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి జిల్లా కలెక్టర్లతో ‘సర్‌’ పురోగతి, ఇతర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫారం–6,7,8 దరఖాస్తులను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, ఎస్‌ఐఆర్‌లో తప్పుగా మ్యాపింగ్‌ అయిన ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అనర్హుల విషయంలో తగిన ఆధారాలతో రికార్డులు భద్రపరచాలన్నారు. కలెక్టర్‌ రాజర్షి షా మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 74 మందికి మాత్రమే హియరింగ్‌ నిర్వహించాల్సి ఉందని, మిగిలిన మ్యాపింగ్‌ తప్పులను త్వరలోనే సరిదిద్దుతామని తెలిపారు. సమావేశంలో ఆర్డీవో జగదీశ్వర్‌రావు, పట్టణ తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎన్నికల విభాగం పర్యవేక్షణ అధికారి నలందప్రియ, నాయబ్‌ తహసీల్దార్‌ మధుసూదన్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement