సన్మానం.. కృతజ్ఞత.. ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

సన్మానం.. కృతజ్ఞత.. ఆహ్వానం

Nov 3 2026 12:57 AM | Updated on Nov 3 2026 12:57 AM

కై లాస్‌నగర్‌: మౌలిక వసతుల కల్పనకు చొరవతో పాటు ఆపత్కాలంలో బాధితులకు అండగా నిలుస్తున్న కలెక్టర్‌ రాజర్షి షాకు ప్రజల నుంచి కృతజ్ఞతలు వెల్లువెత్తుతున్నాయి. భోరజ్‌ మండలం మాండగడలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వంతెన నిర్మాణం, పాఠశాలలో షెడ్డు నిర్మాణ పనులు కలెక్టర్‌ చొరవతో పూర్తి కావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్‌ రవీందర్‌ ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్‌లో కలెక్టర్‌ను కలిసి ఽశాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనారోగ్యంతో బాధ పడుతున్న భీంపూర్‌ మండలం నిపాని గ్రామానికి చెందిన రాకేశ్‌కు రూ.లక్ష ఆర్థికసాయం చేశారు. ఆరోగ్యం నయం కావడంతో ఆయన తన తండ్రితో కలిసి కలెక్టర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే డబ్బాకూచిలో మూతపడ్డ బడిని తెరిపించడంతో పాటు రూ.5లక్షల నిధులను కేటాయించి పాఠశాలకు నూతన భవనం నిర్మాణం జరిగేలా చేశారు. ఆ గ్రామానికి చెందిన పలువురు మహిళలు కలెక్టర్‌ను కలిసి దండారి వేడుకలకు రావాలని ఆహ్వానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement