కై లాస్నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలు పెండింగ్ లేకుండా నిర్దిష్ట గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేస్తూ పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వారం 64 అర్జీలు అందాయని, అలా గే మండల స్థాయిలో 52 వినతులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. ఇందులో అదనపు కలెక్టర్లు ఆర్ఎస్. చిత్రు, ఎస్.రాజేశ్వర్, జెడ్పీ సీఈవో రవి, డీఆర్డీవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


