అభివృద్ధి పనులు చూసి.. సంక్షేమ పథకాలపై ఆరా తీసి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులు చూసి.. సంక్షేమ పథకాలపై ఆరా తీసి

Nov 2 2026 12:35 AM | Updated on Nov 2 2026 12:35 AM

తాంసి: శిక్షణలో భాగంగా సివిల్‌ సర్వీసెస్‌ అధికారుల బృందం ఆదివారం మండలంలోని బండల్‌ నాగాపూర్‌ గ్రామంలో పర్యటించింది. విక్రమ్‌ హైర్‌, దివ్య అన్‌ మాథ్యూ, డాక్టర్‌ వాఘ్మరే స్నేహల్‌ ధ్యానోబా, డాక్టర్‌ వినయ్‌ కుమార్‌అర్చితా దేవా, ఇషితా పాండే గ్రామంలో పర్యటించి అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలు సుకున్నారు. వారి వెంట ఎంపీడీవో మోహన్‌రెడ్డి, ఎంపీవో అవినాష్‌, సర్పంచ్‌ పుష్పల, ఉప సర్పంచ్‌ అనూష, పంచాయతీ కార్యదర్శి హరిత, జీపీవో జాహ్నవి తదితరులున్నారు.

కుమారి గ్రామంలో..

నేరడిగొండ: మండలంలోని కుమారి జీపీలో సివిల్‌ సర్వీసెస్‌ శిక్షణ అధికారులు ఆదివారం గ్రామస్తులతో మమేకమయ్యారు. స్వయం సహాయక సంఘాల మహిళలు నిర్వహిస్తున్న దుకాణాలను సందర్శించారు. ఆయా వ్యాపారాలు, వారి జీవనోపాధి, గ్రామీణ ఆర్థిక పరిస్థితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో శిక్షణ అధికారులు మనీషా నహోరా (ఐపీఎస్‌), ప్రద్యుమ్న సింగ్‌ బిట్టు (ఐఎఫ్‌ఎస్‌), అక్షయ్‌ కుమార్‌ శర్మ (ఐఎస్‌ఎస్‌), అనురాగ్‌ విమల్‌ వర్మ (ఐఎస్‌ఎస్‌), మోహిత్‌ అగర్వాల్‌ (ఐఎఫ్‌ఎస్‌)తో పాటు ఎంపీడీవో గంగసాగర్‌ రెడ్డి, సర్పంచ్‌ గోదావరి తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement