బజార్హత్నూర్: జల్ జంగల్ జమీన్ కోసం పోరాడిన యోధుడు కుమురం భీం అని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. మండలంలోని జాతర్ల, బజార్హత్నూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన భీం విగ్రహాలను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమానికి ఆదివాసీలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, కుమురంభీం స్ఫూర్తితో ఆదివాసీల హ క్కుల పరిరక్షణకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ శ్యాంసుందర్, ఎంపీడీవో మహేందర్రెడ్డి, సర్పంచ్లు సాయన్న, నాందేవ్, మేస్రం మాదవ్, దేవుబాయి, కై లాస్, సింధు జైతు, విజయ, అరవింద్, సంగీత, భీమేష్, యాదవ్రావ్, లక్ష్మీబాయి, పద్మలత, ఆదివాసీ నాయకులు ఈసంరావ్, పాండురంగ్, జంగుబాబు, సుదర్శన్, రమేశ్, బాపురావ్, ఉత్తం, గంగాధర్, జగదీష్, బలిరాం, నాగో రావ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.


