– జోగు రామన్న, మాజీ మంత్రి
సీఎం రేవంత్‌రెడ్డిది రాక్షస పాలన. ఈ ఏడాది జిల్లాలో 178 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, అందులో రైతు బీమా ప్రీమియం ముగిశాకే 108 మంది తనువు చాలించారు. లక్ష మంది రైతుల రుణాలను ఎగ్గొట్టిన దుర్మార్గుడు రేవంత్‌రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు 90శాతం సబ్సిడీపై ట్రాక్టర్లు, డ్రిప్, స్ప్రింక్లర్లు అందజేస్తే, రైఫిల్‌రెడ్డి మాత్రం క్రాప్ హాలీడే ప్రకటించడం సిగ్గుచేటు. బాధల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన స్థానిక ఎమ్మెల్యే శంకర్ ఇండస్ట్రీయల్ కారిడార్, ఎయిర్‌పోర్టు అంటూ కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నాడు. సర్కార్‌కు వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తానని బెదిరించి రేవంత్ రెడ్డి కమీషన్లకు అమ్ముడుపోయాడు. పాదయాత్ర మర్చి భూ దందా సాగిస్తున్నాడు. జిల్లాలో అన్ని మండలాలను కరువుగా ప్రకటించే వరకు కేటీఆర్ నాయకత్వంలో పోరాడుతూనే ఉంటాం.


