ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల హ్యాండ్‌బాల్ టోర్నీలో భాగంగా ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్టు టైటిల్‌ను కై వసం చేసుకుంది. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో రెండు రోజులుగా జరుగుతున్న టోర్నీ ఆదివారం ముగిసింది. ఈ మేరకు ఫైనల్స్‌లో ఖమ్మం –వరంగల్ జట్లు తలపడగా ఖమ్మం గెలిచింది. ఇక మూడో స్థానం కోసం మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జట్లు తలపడగా సమాన పాయింట్లు రావడంతో ఇరు జట్లకు ట్రోఫీ అందజేశారు. డీవైఎస్వో టి.సునీల్‌రెడ్డి, హ్యాండ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్, హ్యాండ్‌బాల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.అశోక్‌రెడ్డి, వరికూటి మోహన్‌తో పాటు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి ట్రోఫీలు అందజేశారు.


