టవేరా వాహనాన్ని ఢీకొన్న ద్విచక్ర వాహనం | - | Sakshi
Sakshi News home page

టవేరా వాహనాన్ని ఢీకొన్న ద్విచక్ర వాహనం

Nov 2 2026 12:05 AM | Updated on Nov 2 2026 12:05 AM

ఖానాపూర్‌: పట్టణంలోని కుమురం భీం చౌరస్తా సమీపంలో నిర్మల్‌ –ఖానాపూర్‌ ప్రధాన రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక టవేరా వాహనాన్ని మరో టవేరా వాహనంతో టోయింగ్‌ (లాగుడు) ద్వారా తీసుకెళ్తుండగా, దిమ్మదుర్తి నుంచి ఖానాపూర్‌ వైపు వస్తున్న శాంతినగర్‌ కాలనీకి చెందిన బాలేకర్‌ గంగేశ్వర్‌ ద్విచక్ర వాహనంతో వెనుక నుంచి ఢీకొట్టాడు. ప్రమాదంలో గంగేశ్వర్‌కు తీవ్ర గాయాలు కాగా, బైక్‌పై వెనుక కూర్చున్న ఆశన్నకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement