జన్నారం: కవ్వాల్ టైగర్‌జోన్ జన్నారం అటవీ డివిజన్‌లో సఫారీకి పర్యాటకులు మక్కువ చూపుతున్నారు. సఫారీ ద్వారా ఉదయం 7 గంటలకు, 9 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు రోజుకు మూడుసార్లు సందర్శకులకు అనుమతి ఉంటుంది. గేట్ నంబర్ 1 నుంచి గొండుగూడ బేస్‌క్యాంపు మీదుగా బైసన్ కుంట వరకు, అక్కడి నుంచి కెనాల్ మీదుగా నిలుగాయి కుంట, తిరిగి గేట్ నంబర్ 1 వరకు సఫారీ ప్రయాణం ఉంటుంది. కాగా అక్టోబర్‌లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హరిత రిసార్ట్‌కు పర్యాటకుల తాకిడి పెరిగినట్లు మేనేజర్ వీరేందర్ తెలిపారు. ఈ ఒక్క నెలలోనే 2009 మంది పర్యాటకులు సఫారీ ప్రయాణం చేసినట్లు చెబుతున్నారు.


