అట్టహాసంగా సాఫ్ట్‌బాల్‌ పోటీలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా సాఫ్ట్‌బాల్‌ పోటీలు ప్రారంభం

Nov 2 2026 12:05 AM | Updated on Nov 2 2026 12:05 AM

నిర్మల్‌టౌన్‌: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో రాష్ట్రస్థాయి అండర్‌ జూనియర్‌ బాలికల సాఫ్ట్‌బాల్‌ పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పోశెట్టి, సెక్రెటరీ అన్నపూర్ణ ఆధ్వర్యంలో పోటీలు జరుగుతుండగా జిల్లా క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్‌ రెడ్డి జెండా ఊపి పోటీలు ప్రారంభించారు. పోటీల్లో 21 జిల్లాల నుంచి 21 జట్లు, 450 మంది క్రీడాకారులు, 40 మంది కోచ్‌లు, కోఆర్డినేటర్లు మొత్తం 600 మంది పాల్గొన్నారు. వీరికి జిల్లా కేంద్రంలోని దీక్ష జూనియర్‌ కాలేజ్‌, వశిష్ట, రవి పాఠశాలలో వసతి ఏర్పాటు చేశారు. మొదటి మ్యాచ్‌లో వరంగల్‌, పెద్దపల్లి జట్లు తలపడ్డాయి. పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారు జాతీయ స్థాయికి ఎంపికవుతారు. సాఫ్ట్‌ బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర సెక్రెటరీ నవీన్‌ కుమార్‌, ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ శోభన్‌ బాబు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement