నేటి నుంచి సాఫ్ట్‌బాల్‌ రాష్ట్రస్థాయి పోటీలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి సాఫ్ట్‌బాల్‌ రాష్ట్రస్థాయి పోటీలు

Nov 1 2026 12:27 AM | Updated on Nov 1 2026 12:27 AM

నిర్మల్‌టౌన్‌: నిర్మల్‌ జిల్లా రాష్ట్రస్థాయి జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఆతిథ్యమివ్వనుంది. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో పోటీల నిర్వహణకు సంబంధించిన మైదానాలను సిద్ధం చేసి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్లు, రాష్ట్ర, జిల్లా స్థాయి అధ్యక్ష, కార్యదర్శులు కలిపి సుమారు 600 మంది పాల్గొననున్నారు. ఆదివారం ప్రారంభమయ్యే మ్యాచ్‌లు సోమవారం ముగియనున్నాయి. పోటీల నిర్వహణ ఏర్పాట్లలో జిల్లా అధ్యక్షుడు పోశెట్టి, కార్యదర్శి అన్నపూర్ణ, వ్యాయామ ఉపాధ్యాయుడు గస్కంటి గంగాధర్‌, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement