సాత్నాల: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వివాహిత మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన భోరజ్ మండలం పెండల్‌వాడ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సతీశ్‌తో సౌమ్యకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త కూరగాయల వ్యాపారం, సౌమ్య ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఫిట్స్ సమస్యతో బాధపడుతున్న సౌమ్య, నాలుగేళ్ల క్రితం సైనస్ ఆపరేషన్ చేయించుకుంది. మళ్లీ ఫిట్స్, సైనస్ సమస్యలు తిరగబడడంతో మనోవేదనకు గురైంది. శనివారం ఉదయం భర్త కూరగాయల కోసం ఆదిలాబాద్‌కు వెళ్లగా ఇంట్లో చిన్న కొడుకు నిద్రిస్తున్న సమయంలో ఉరేసుకుంది. చుట్టుపక్కల వాళ్లు గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తల్లి గొంటిముక్కుల కిష్టమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఏఎస్సై సంజీవ్ తెలిపారు.


