వందేమాతరం సదస్సులో నిర్మల్‌ యువకులు | - | Sakshi
Sakshi News home page

వందేమాతరం సదస్సులో నిర్మల్‌ యువకులు

Nov 1 2026 12:27 AM | Updated on Nov 1 2026 12:27 AM

తానూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయవాడలో ఈ నెల 26వ తేది నుంచి కొనసాగుతున్న వందేమాతరం సదస్సులో నిర్మల్‌ జిల్లా నుంచి ఇద్దరు ఆదివాసీ నాయక్‌పోడ్‌ యువకులు పాల్గొన్నారు. వందేమాతరం గేయం ర చించి 150 ఏళ్లు పూర్తికావడంతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ముధోల్‌ మండలం ముద్గల్‌ గ్రామానికి చెందిన నర్సయ్య, తానూరు మండలం మొగ్లి గ్రామానికి చెందిన పడకంటి సాయిప్రసాద్‌లు పాల్గొన్నారు. ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలపై నాటిక ప్రదర్శన ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement