బోథ్: మండల కేంద్రంలోని వేంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట ఉన్న ఓ టేలాలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. దుకాణానికి అమర్చిన రేకులను కట్టర్లతో కోసి లోపలికి ప్రవేశించిన దుండగులు.. గల్లాపెట్టెలో ఉన్న సుమారు రూ.3 వేల నగదుతో పాటు దుకాణంలోని సరుకులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో మొత్తం రూ.13 వేల మేర నష్టం వాటిల్లినట్లు దుకాణ యజమాని నాగనాథ్ తెలిపారు. శనివారం ఉదయం దుకాణం తెరిచేందుకు వచ్చిన ఆయన.. రేకులు కోసి ఉండటం, నగదు, సరుకులు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టార


