బాసర: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు అ త్యంత వేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భా గంగా శనివారం గర్భాలయ నిర్మాణానికి ఉపయోగించే పవిత్ర కృష్ణ శిలకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి ఆధ్వర్యంలో వైదిక బృందం వేదమంత్రాల నడుమ పూజా కార్యక్రమాన్ని చేపట్టింది.
దాతల సహకారంతో గర్భాలయ నిర్మాణం..
బాసర క్షేత్ర సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 354 కోట్ల భారీ నిధులను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అమ్మవారి ప్రధాన గర్భాలయ నిర్మాణాన్ని ప్రముఖ దాత సురపునేని సునంద పద్మప్రియ అందిస్తున్న ఆర్థిక సహకారంతో నిర్మిస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతో పాటు దాతల భాగస్వామ్యం కూడా తోడవడంతో ఆలయ రూపురేఖలు అద్భుతంగా మారనున్నాయి.
అధికారుల పర్యవేక్షణ..
ఆలయ పునర్నిర్మాణ పనులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. శనివారం జరిగిన ఈ పవి త్ర పూజా కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ ఎగ్జి క్యూటివ్ ఆఫీసర్ (ఏఈఓ) గంగా శ్రీనివాస్‌తో పా టు ఆలయ అర్చక వైదిక బృందం, వివిధ విభాగా ల అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


