వీడిన హత్య మిస్టరీ | - | Sakshi
Sakshi News home page

వీడిన హత్య మిస్టరీ

Nov 1 2026 12:27 AM | Updated on Nov 1 2026 12:27 AM

● కొట్టి చంపిన తోటి స్నేహితులు ● మద్యం మత్తులో ఘటన

● కొట్టి చంపిన తోటి స్నేహితులు ● మద్యం మత్తులో ఘటన

శ్రీనగర్‌కాలనీ: యూసుఫ్‌గూడ ఎల్‌ఎన్‌నగర్‌లో అక్టోబర్‌ 27న అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన సినీకార్మికుడు ఊకే స్వామి అలియాస్‌ రిషిని హత్యచేసిన తోటి స్నేహితులను శనివారం మధురానగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అక్టోబర్‌ 27న దుర్వాసనతో కుళ్లిన స్థితిలో స్వామి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తోటి రూమ్‌మేట్స్‌ ఆదిలాబాద్‌కు చెందిన పెందూర్‌ కుమార్‌స్వామి, పెందూర్‌ సంతోష్‌, మీస్రం ఆకాష్‌, విశాఖపట్నానికి చెందిన కుడుముల మణికంఠ వర్థఽన్‌ కనిపించకుండా పరారయ్యారు. అక్టోబర్‌ 25రాత్రి స్వామితోపాటు నలుగురు స్నేహితులు మద్యం తాగారు. ఇంటి అద్దె విషయంలో స్వామితోపాటు స్నేహితుల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన కుమార్‌స్వామి చిన్న సిలిండర్‌ బండతో స్వామిని బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. వెంటనే స్నేహితులు తమ స్వస్థలాలకు పరారయ్యారు. విచారణ చేపట్టిన మధురానగర్‌ పోలీసులు స్వామి స్నేహితులైన ఆదిలాబాద్‌కు చెందిన కుమార్‌స్వామి, సంతోష్‌, ఆకాష్‌ను వారి స్వస్థలాల్లో, మణికంఠను కృష్ణనగర్‌ పుట్‌పాత్‌లో అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

దస్తురాబాద్‌: మండలంలోని మున్యాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న వి.భూమేష్‌ శనివారం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జోనల్‌ స్థాయి అండర్‌17 జావెలిన్‌ త్రోలో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయులు , వ్యాయామ ఉపాధ్యాయుడు వామనరావ్‌, నవీన్‌ తెలిపారు. ఎంఈవో గంగాధర్‌, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement