కై లాస్‌నగర్: ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన రాహుల్ కాంబ్లే కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని దళిత సంఘాల నేతలు కలెక్టర్ రాజర్షిషాను కోరారు. ఽశనివారం జిల్లా దళిత సంఘాల నాయకులతో తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు ఆత్మహత్యకు కారణమైన డా. సారాబ్, హెడ్‌కానిస్టేబుల్ ఫతేసింగ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాలని కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్ స్పందిస్తూ బాధ్యులను అరెస్ట్ చేసేలా ఎస్పీతో మాట్లాడుతానని హామీనిచ్చినట్లు తెలిపారు. రాహుల్ కాంబ్లే తమ్ముడికి రిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగం కల్పిస్తానని చెప్పారన్నారు. అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సునీత, దళిత సంఘాల నాయకులు రత్నజాడే ప్రజ్ఞకుమార్, భీంరావ్ వాగ్మారె, మల్యాల స్వామి, కొప్పుల రమేశ్, దాదాసాహెబ్ జాబాడే, సందీప్ దండ్గే, రాహుల్ కాంబ్లే తల్లిదండ్రులు మాయ, రాజు, తమ్ముడు నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.


