బాలల హక్కులను పరిరక్షిద్దాం | - | Sakshi
Sakshi News home page

బాలల హక్కులను పరిరక్షిద్దాం

Nov 1 2026 12:27 AM | Updated on Nov 1 2026 12:27 AM

నిర్మల్‌టౌన్‌ /లక్ష్మణచాంద/భైంసారూరల్‌: బాలల హక్కుల పరిరక్షణ మన అందరి బాధ్యత అని, ఇందుకోసం అందరూ కృషి చేయాలని లీగల్‌ అథారిటీ జిల్లా సెక్రెటరీ రవీందర్‌, జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ నిఖిత, భైంసా జూనియర్‌ సివిల్‌ జడ్జి ఆర్‌కె.వెంకటరమణ సుహాస్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సురక్షిత్‌ బచ్పన్‌ అభియాన్‌లో భాగంగా నిర్మల్‌లోని సెయింట్‌ థామస్‌, విన్నర్స్‌ హైస్కూళ్లలో, సోన్‌ ప్రభుత్వ పాఠశాలలో, భైంసా రూరల్‌ మండలం దేగాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులకు వేర్వేరుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. బాలల హక్కులు, రక్షణ, లైంగిక వేధింపుల నుంచి పిల్లలను కాపాడుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఎవరైనా వేధింపులకు పాల్పడితే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. బాలల భద్రతకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు. పోక్సో చట్టం బాలలకు కల్పించే రక్షణను వివరించారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమాల్లో ఎస్సైలు గోపి, సుప్రియ, న్యాయవాదులు మాధురి, షేక్‌ అంజద్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement