సిరికొండ మండలం వాయిపేట గ్రామానికి చెందిన జాదవ్ సాయి ప్రసాద్‌ది సాధారణ వ్యవసా య కుటుంబ నేపథ్యం. ఉట్నూరు గిరిజన క్రీడా ఆదర్శ పాఠశాలలో పదో తరగతి చదువుతూనే హాకీలో రాణిస్తున్నాడు. ఇప్పటికే మధ్యప్రదేశ్ వేదికగా నిర్వహించిన అండర్–14 ఎస్జీఎఫ్ పోటీల్లో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు 22 రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున పాల్గొని తన క్రీడా నైపుణ్యాలతో మెప్పించాడు. ఏకంగా 10 స్వర్ణాలు, 8 కాంస్య పతకాలు సాధించడం విశేషం. హాకీలో సెంటర్ హాఫ్ పొజిషన్లో సత్తాచాటుతున్నాడు. తా జాగా జార్ఖండ్ వేదికగా నిర్వహించే జాతీయస్థా యి అండర్–17 ఎస్జీఎఫ్ పోటీలకు ఎంపికయ్యాడు. భవిష్యత్తులో భారత హాకీ జట్టులో స్థానమే లక్ష్యంగా నిరంతరం సాధన చేస్తున్నా డు. హాకీ కోచ్ శేఖర్ శిక్షణలో తన నైపుణ్యాలు మె రుగుపరుచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కోచ్ ప్రోత్సాహంతోనే ఈ విజయాలు సాధ్యమవుతున్నాయని సాయి ప్రసాద్ తెలిపాడు.


