బీఆర్‌ఎస్‌ పాలనలో జిల్లాకు చేసిందేమీ లేదు | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ పాలనలో జిల్లాకు చేసిందేమీ లేదు

Nov 1 2026 12:21 AM | Updated on Nov 1 2026 12:21 AM

● ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌

ఆదిలాబాద్‌/సాత్నాల: పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఆదిలాబాద్‌ జిల్లాకు చేసిందేమీ లేదని ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. తమ హయాంలో జిల్లాకు చేసిన అభివృద్ధి ఏమిటో రైతు గర్జన సభకు వస్తున్న కేటీఆర్‌ ఈ ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో జిల్లాకు రావాల్సిన గిరిజన యూనివర్సిటీని ములుగుకు తరలించారని మండిపడ్డారు. పరిశ్రమలు సైతం ఏర్పాటు చేయలేదని, టెక్స్‌టైల్‌ పార్క్‌ సైతం దక్కకుండా పోయిందని పేర్కొన్నారు. కొరటా–చనాఖా ప్రాజెక్టును పదేళ్లలో పూర్తి చేయలేకపోగా, కాలువల నిర్మాణంలో నాణ్యత లోపించిందని ఆరోపించారు. పనుల అంచనాలు, కాంట్రాక్టులు, నిధుల వినియోగంపై విజిలెన్స్‌ విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టాక కేంద్ర ప్రభుత్వ నిధులతో రూ.128 కోట్ల ఆర్వోబీ, ఆర్‌యూబీ ప్రాజెక్టును తీసుకొచ్చానని, విమానాశ్రయ ఏర్పాటుకు కృషి చేస్తున్నానని తెలిపారు. అంతక ముందు భోరజ్‌ మండలం హత్తిఘాట్‌ సమీపంలో నిర్మించిన కొరటా చనాఖా ప్రాజెక్టును సందర్శించారు. నిర్మాణ పనులను పరిశీలించారు. ఇందులో పార్టీ నాయకులు రఘుపతి, రవి, శ్రీకాంత్‌, పోషన్న, శివగౌడ్‌, సూర్యకిరణ్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement