మీరా పట్టుపడితే.. పతకమే | - | Sakshi
Sakshi News home page

మీరా పట్టుపడితే.. పతకమే

Nov 1 2026 12:21 AM | Updated on Nov 1 2026 12:21 AM

పట్టుదలతో సాధన చేస్తూ కుస్తీలో వరుస విజయాలు సాధిస్తోంది ఇంద్రవెల్లి మండలం హీరాపూర్‌ గ్రామానికి చెందిన చోలే శంకర్‌–జ్యోష్ణ దంపతుల కుమార్తె మీరా. అండర్‌–15 విభాగంలో జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల వరకు తన ప్రతిభ చాటుతోంది. ఎస్‌జీఎఫ్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని రజత పతకం సాధించింది. 2025–26లో నిర్వహించిన ఏడో సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ కేసరి పోటీల్లో పాల్గొన్న జ్యోత్స్న, హనుమాన్‌ కేసరి చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది. తాజాగా ఢిల్లీ వేదికగా నిర్వహిస్తున్న 70వ ఎస్‌జీఎఫ్‌ జాతీయ పాఠశాల క్రీడలకు ఎంపికై ంది. అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 4 వరకు ఢిల్లీలో జరిగే ఈ పోటీల్లో పాల్గొననుంది. జాతీయ స్థాయిలోనూ మెరుగైన ప్రదర్శనతో పతకం సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement