ఉట్నూరు మండలం చింతగూడ గ్రామానికి చెందిన సిడాం నవీన్ కుమార్ ఖోఖోలో విశేష ప్రతిభ కనబరుస్తున్నా డు. ఇప్పటివరకు 3 జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున ప్రా తినిధ్యం వహించాడు. సబ్ జూనియర్ విభా గంలో కర్ణాటకలో నిర్వహించిన పోటీల్లో రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించగా, జట్టు కాంస్యపతకం సాధించింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్–14 జాతీయ పోటీల్లో రాష్ట్ర జట్టు రజత పతకం సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. అయోధ్యలో నిర్వహించిన జాతీయస్థాయి ఎస్జీఎఫ్ అండర్–17 పోటీల్లోనూ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించాడు. తాజాగా గుజ రాత్‌లో నిర్వహించనున్న జూని యర్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యా డు. ఇప్పటివరకు రాష్ట్రస్థాయిలో 15 స్వర్ణాలు, 2 రజతాలు, 3 కాంస్య పతకాలు సాధించి సత్తా చాటుకున్నాడు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించే ఆశాకిరణంగా మారాడు.


