కై లాస్‌నగర్: పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పత్తి కొనుగోళ్ల సన్నద్ధతపై సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నాణ్యత లేని పత్తి మార్కెట్‌కు రాకుండా ఏఈవోలు శ్రద్ధ వహించాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన ధర్మాబాద్, కిన్వట్ నుంచి వచ్చే పత్తి నిల్వలపై ప్రత్యేక నిఘా ఉంచి, జిన్నింగ్ మిల్లుల వద్ద లోకల్ మానిటరింగ్ కమిటీలతో పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. కౌలు రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను గ్రామస్థాయిలో ఏవో, పంచాయతీ కార్యదర్శులు పక్కాగా నిర్వహించాలన్నారు. ప్రతి లావాదేవీలోనూ ఆధార్ అనుసంధానం, ఓటీపీ తప్పనిసరిగా ఉండేలా చూసుకో వాలన్నారు. రైతు రిజిస్ట్రీ ఐడీ ఆధారంగానే స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఉంటుందని, జిల్లాలో రైతుల భూ ముల వివరాలు, సాగు విస్తీర్ణం ఆధారంగా అర్హతలను నిర్ధారించి స్లాట్లు కేటాయించాలని తెలిపారు. ఒక రైతు ఒక రోజులో గరిష్టంగా 100 క్వింటాళ్ల వర కు స్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు. గతంలో స్లాట్ గడువు 7 రోజులు ఉండగా, ఈసారి దానిని 14 రో జులకు పెంచినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, జిల్లా మార్కెటింగ్ అధికారి గజానన్, మార్క్‌ఫెడ్ డీఎం మహేశ్‌కుమార్, టెక్నికల్ ఏవో విశ్వామిత్ర, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, సీసీఐ ప్రతినిధులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ
అక్టోబర్ 2న నిర్వహించే గ్రామసభల్లో బాల్య వి వాహ రహిత గ్రామం అంశాన్ని అజెండాగా చర్చించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బాల్ వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన పోస్టర్‌ను బుధవారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, నీతి ఆయోగ్ చైల్డ్ రైట్స్ అసోసియేట్ దేవిశ్రీ తదితరులు పాల్గొన్నారు.


