విదేశీఉద్యోగాల మోసాలపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

విదేశీఉద్యోగాల మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

Oct 1 2026 4:58 AM | Updated on Oct 1 2026 4:58 AM

నిర్మల్‌ఖిల్లా: విదేశీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న సైబర్‌ మోసాలు, నకిలీ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలు, సబ్‌ఏజెంట్ల మోసాలపై జిల్లా యువత, వలస కార్మికులు అప్రమత్తంగా ఉండాలని ప్రొటెక్టర్‌ ఆఫ్‌ ఎమిగ్రెంట్స్‌ దేవులపల్లి ఆనంద్‌ సూచించారు. హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో బుధవారం ఆయనతో తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ అడ్వైజరీ కమిటీ సభ్యుడు, నిర్మల్‌ జిల్లాకు చెందిన స్వదేశ్‌ పరికిపండ్ల భేటీ అయ్యారు. జిల్లా నుంచి విదేశాలకు వెళ్తున్న కార్మికుల సమస్యలు, విదేశీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలు తదితర అంశాలపై చర్చించారు. వలస కార్మికుల కోసం ప్రభు త్వ సంస్థలు, కార్మిక సంఘాలు, ఎన్‌ఆర్‌ఐ సంస్థలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని స్వదేశ్‌ పరికిపండ్ల పేర్కొన్నారు. బీజేపీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ కన్వీనర్‌ నరేంద్ర పన్నేరు, సిరిసిల్ల జిల్లా గల్ఫ్‌ కాంగ్రెస్‌ కన్వీనర్‌ తోట ధర్మేందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement