ఆటో బోల్తా.. ఒకరికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా.. ఒకరికి గాయాలు

Oct 1 2026 4:58 AM | Updated on Oct 1 2026 4:58 AM

సారంగపూర్‌: నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం మలక్‌చించోలి సబ్‌స్టేషన్‌ మూలమలుపు వద్ద బుధవారం ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని షివిని గ్రామానికి చెందిన ముగ్గురు వ్యవసాయ కూలీలు నిత్యం ఇదే ప్రాంతంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సారంగాపూర్‌ నుంచి బీరవెల్లివైపు ముగ్గురు కలిసి ఆటోలో వెళ్తున్న క్రమంలో మలక్‌చించోలి సబ్‌స్టేషన్‌ మూలమలుపు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈప్రమాదంలో ఆటోలో ఉన్న ఒక మహిళ, మరో వ్యక్తికి ఎలాంటా గాయాలు కాలేదు. మరో వ్యక్తి రాథోడ్‌ లక్ష్మణ్‌ తలకు, శరీరానికి గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న పోలీసు సిబ్బంది క్షతగాత్రుడిని 108లో నిర్మల్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement