● కాలు విరిగిన మహిళకు వీల్‌చైర్ కరువు
ఆదిలాబాద్‌టౌన్: కాలు విరిగి చికిత్స కోసం రిమ్స్‌కు వచ్చిన ఓ మహిళకు వీల్‌చైర్ అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొ న్న ఘటన మంగళవారం చోటు చేసుకుంది. నడవడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ సాయం అందకపోవడంతో ఆ మహిళ ఆస్పత్రిలో నడుచుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి. రోగి ఆస్పత్రికి వచ్చిన వెంటనే వీల్‌చైర్, స్ట్రెచర్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచాల్సి ఉండగా, అవి అందకపోవడంపై రోగి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు సకాలంలో సాయం అందించాల్సిన పేషెంట్ కేర్ సిబ్బంది సేవలు ఎక్కడున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రోగుల వసతులు, స్ట్రెచర్ల కొరత తదితర అంశాలపై విమర్శలు వ స్తున్న నేపథ్యంలో తాజా ఘటన ఆస్పత్రి నిర్వహణ తీరుపై మరోసారి చర్చకు దారితీసింది.


