కై లాస్‌నగర్: జిల్లాలో పత్తి కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేసి, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోళ్లపై మంగళవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో రైతులు, రైతుసంఘాల ప్రతి నిధులు, వ్యాపారులు, సీసీఐ వ్యవసాయ, మార్కెటింగ్, పోలీస్, ఫైర్,లీగల్ మెట్రాలజీ శాఖల అధి కారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. తొలుత ఆయా వర్గాల వారి నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. కొనుగోళ్ల ముహూర్తంపై చర్చకు రా గా ప్రైవేట్ వ్యాపారులు ఈ నెల 12 నుంచి, సీసీఐ 21 నుంచి చేపడుతామని తెలిపారు. అయితే సీసీఐ కూడా 12 నుంచే ప్రారంభించేలా చూడాలని కలెక్ట ర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిన్నింగ్ మిల్లుల వివరాలను యాప్‌లో నమోదు చేసి, రైతులను సంబంధిత మిల్లులకు ట్యాగింగ్ చేసే ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, నీడ, తూకం తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. మాయిశ్చర్ మీటర్లను సక్రమంగా వినియోగించేలా వీఓలు, గ్రేడర్లు, సీసీఐ సిబ్బందికి ప్రత్యేక శిక్షణనందించాలని సూచించా రు. ప్రతీకొనుగోలు కేంద్రంలో హెల్ప్‌డెస్క్ ఏర్పా టు చేయాలన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ జిన్నింగ్ మిల్లుల్లో కంప్యూటర్ ఆపరేటర్లు పనిచేసే ప్రాంతాలు, ప్రవేశ ద్వారాల వద్ద సీసీ కెమెరాలు వంద శాతం పనిచేసేలా శ్రద్ధవహించడంతో పాటు రికార్డులను భద్రపరచాలన్నారు. మిల్లుల్లో అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని, నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గతేడాది కంప్యూటర్ ఎంట్రీల సమయంలో చోటుచేసుకున్న పొరపాట్లు పునరావృత్తం కా కుండా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ఆర్‌ఎస్.చిత్రు, సబ్ కలెక్టర్ కె.ప్రణయ్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ బొరంచు శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, మార్కెటింగ్ ఏడీ గజానంద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్ సింగ్, సిసిఐ బ్రాంచ్ మేనేజర్ పునీత్ , డీఎస్పీ జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.
కలెక్టర్, ఎస్పీలకు సన్మానం ..
కాగా జిల్లాలో గణేశ్ నిమజ్జన ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించినందుకు గాను రైతుల సంఘాల ప్రతినిధులు కలెక్టర్, ఎస్పీలను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఆదిలాబాద్‌టౌన్: వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించిన జిల్లా పోలీసు శాఖకు సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్‌ను కలిసి శాలువాతో సత్కరించి, గణపతి చిత్రపటాన్ని అందజేశారు. వారి వెంట సమితి ప్రతినిధులు ఉన్నారు.
మహారాష్ట్ర రైతులకు అనుమతి
మహారాష్ట్రలోని కిన్వాట్, మహోర్ తాలుకాల పరిధిలోని 176 గ్రామాల రైతులు పండించిన పత్తి పంటను జిల్లాలో సీసీఐకి విక్రయించేందు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. సన్నాహాక సమావేశంలో అధికారులు ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సమావేశానికి ఆయా తాలుకాలకు చెందిన వ్యవసాయాధికారులు హాజరయ్యారు. కాగా, కపాస్ కిసాన్‌యాప్‌లో స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు వీలుగా అక్కడి రైతుల పంట సాగు వివరాలను సంబంధిత యాప్‌లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.


