ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిని తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. ఎన్‌ఆర్‌సీ సెంటర్, గైనిక్ విభాగం, పీడియాట్రిక్ విభాగాలను పరిశీలించారు. న్యూట్రీషియన్ సెంటర్‌లో చిన్నారులకు ఇస్తున్న ఆహార పదార్థాల గురించి అడిగి తెలుసుకున్నారు. అరటిపండ్లు, కోడిగుడ్లు తదితర పోషక పదార్థాలు ఇస్తున్నారా అనే దానిపై ఆరా తీశారు. నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. గర్భిణులతో మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా కోడిగుడ్లు, పోషకపదార్థాలు అందుతున్నాయా.. లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీఎంహెచ్‌వో సాధన తదితరులున్నారు.


